News November 15, 2024

BGT: INDపై AUS గేమ్‌ప్లాన్

image

ఆసీస్‌లో అడుగుపెట్టిన IND ఒకేసారి 2 గేముల్లో తలపడాల్సి ఉంటుంది. ఒకటి క్రికెట్. రెండోది మైండ్‌గేమ్. కొన్నేళ్లుగా అక్కడిదే ఒరవడి. ముందు అక్కడి మీడియా భారత జట్టులో విభేదాలున్నట్టు నెరేటివ్ సృష్టిస్తుంది. ఆ తర్వాత పాంటింగ్ సహా ఇతర మాజీలు భారత క్రికెటర్ల ఫామ్ బాలేదని, ఓడిపోతారని చెప్పేస్తారు. కోహ్లీతో పెట్టుకోవద్దని అప్పట్లో మానేశారు. IND ఫామ్ లేమి, NZ చేతిలో క్లీన్‌స్వీప్ అవ్వడంతో మళ్లీ మొదలెట్టారు.

Similar News

News April 16, 2026

మహిళలకు LSలో 272 సీట్లు: కేంద్ర మంత్రి

image

ఉమెన్ రిజర్వేషన్ల అమలు ద్వారా లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వు అవుతాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రకటించారు. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లులను ఆయన LSలో ప్రవేశపెట్టారు. ‘LS స్థానాలు 543 నుంచి గరిష్ఠంగా 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల నుంచి 815, UTల నుంచి 35 ఉంటాయి. రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెరుగుతాయి. స్త్రీలకు 272 దక్కుతాయి. ఇవి 33%కి సమానం’ అని తెలిపారు.

News April 16, 2026

‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

image

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.