News November 30, 2024
BGT: రెండో టెస్టుకు హెజిల్‌వుడ్ దూరం

భారత్‌తో జరిగే BGT రెండో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్‌వుడ్ గాయం కారణంగా దూరమయ్యారు. పక్కటెముకల్లో నొప్పితో అతడు బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. మరో ఇద్దరు పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డొగెట్‌ను జట్టుకు ఎంపిక చేసింది. డిసెంబర్ 6 నుంచి జరిగే రెండో టెస్టులో హెజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్టులో హెజిల్‌వుడ్ 5 వికెట్లు తీశారు.
Similar News
News January 25, 2026
మీరు చదివిన స్కూల్ ఇప్పుడు ఉందా..?

మనం చదివిన స్కూల్, కాలేజ్ ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. కానీ ప్రైవేట్లో చదివిన చాలామంది స్కూళ్లు, కాలేజెస్ ఇప్పుడు లేవు. పేరు, మేనేజ్మెంట్ మారడం, ఆ బిల్డింగ్‌లో మరొకటి కొనసాగడం సహా కొన్ని చోట్లయితే అసలు ఆ నిర్మాణాలే లేవు. ఇంకొందరికైతే స్కూల్ to కాలేజ్ ఏవీ లేవు. ఆ డేస్ గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీ చిట్‌చాట్లో ఈ మధ్య ఎక్కువగా ఇవి విన్పిస్తున్నాయి. ఇంతకీ మీరు చదివినవి ఇప్పుడున్నాయా? కామెంట్ చేయండి.
News January 25, 2026
చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.
News January 25, 2026
భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.


