News December 14, 2024
BGT: టాస్ గెలిచిన భారత్.. జట్టులో మార్పులు
బ్రిస్బేన్‌లో జరుగుతున్న 3వ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అశ్విన్ స్థానంలో జడేజా, హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్ ఆడనున్నారు.
IND: రోహిత్, జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, పంత్, నితీశ్, జడేజా, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా.
AUS: ఖవాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, కేరీ, కమిన్స్, స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్.
Similar News
News January 16, 2025
జారిపడ్డ పోప్.. చేతికి గాయం
పోప్ ఫ్రాన్సిస్ గాయపడ్డట్లు వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. శాంటా మార్టాలోని తన నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు జారి పడటంతో మోచేతికి గాయమైనట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ కాలేదని, గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు నెలల్లో పోప్ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవల ఆయన బెడ్ పైనుంచి కింద పడటంతో దవడకు దెబ్బ తగిలింది.
News January 16, 2025
రేపు ఓటీటీలోకి విడుదల-2?
వెట్రిమారన్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్‌గా నిలిచాయి.
News January 16, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.10వేల కోట్ల ప్యాకేజీ?
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఫైనాన్షియల్ ప్యాకేజీ కింద రూ.10వేల కోట్లు ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో చర్చించిందని జాతీయ మీడియా పేర్కొంది. ఆర్థిక ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.