News November 21, 2024

BGT: తొలి టెస్టు సెషన్స్ టైమింగ్స్ ఇవే

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.20 గంటలకు టాస్ వేస్తారు. 7.50 గంటల నుంచి 9.50 గంటల వరకు తొలి సెషన్, 10.30 గంటల నుంచి 12.30 వరకు రెండో సెషన్, 12.50 గంటల నుంచి 2.50 గంటల వరకు చివరి సెషన్ కొనసాగనుంది. లంచ్ బ్రేక్‌కు 40 నిమిషాల సమయం కేటాయించారు.

Similar News

News December 10, 2025

ఐబీపీఎస్ SO, PO ఫలితాలు విడుదల

image

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <>ibps<<>> వెబ్‌సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇందులో పాసైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. 1,007 ఉద్యోగాలకు గత నెల 9న పరీక్ష జరిగింది. అటు ibps ప్రొబెషనరీ ఆఫీసర్(PO) మెయిన్స్ స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి.

News December 10, 2025

‘మిస్టర్ ఇండియా’గా CISF జవాన్

image

జైపూర్‌(RJ)లో జరిగిన 6వ మిస్టర్ ఇండియా 2025 ఛాంపియన్‌షిప్‌లో CISF కానిస్టేబుల్ రిషిపాల్ సింగ్ అద్భుత విజయం సాధించారు. ఆయన ‘మిస్టర్ ఇండియా’ ట్రోఫీతో పాటు 50+ వయస్సు & 65–70 కేజీల బాడీబిల్డింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. రిషిపాల్ సింగ్ అంకితభావం & క్రమశిక్షణ ఫోర్స్‌కు గర్వకారణమని CISF ప్రశంసించింది. ఈ విజయం జాతీయ స్థాయిలో CISFకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడింది.

News December 10, 2025

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.