News November 21, 2024

BGT: తొలి టెస్టు సెషన్స్ టైమింగ్స్ ఇవే

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.20 గంటలకు టాస్ వేస్తారు. 7.50 గంటల నుంచి 9.50 గంటల వరకు తొలి సెషన్, 10.30 గంటల నుంచి 12.30 వరకు రెండో సెషన్, 12.50 గంటల నుంచి 2.50 గంటల వరకు చివరి సెషన్ కొనసాగనుంది. లంచ్ బ్రేక్‌కు 40 నిమిషాల సమయం కేటాయించారు.

Similar News

News July 11, 2025

ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్!

image

జపాన్ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సృష్టించింది. సెకనుకు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్= 10లక్షల GBలు) ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వేగంతో ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని డేటా మొత్తం లేదా 150 GB వీడియో గేమ్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఇది భారత సగటు ఇంటర్నెట్ వేగంతో (63.55 Mbps) పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది.

News July 11, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు

News July 11, 2025

ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

image

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.