News November 6, 2024
BGT: రోహిత్ దూరమైతే జైస్వాల్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరంటే?
ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో BGT ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ ఫస్ట్ మ్యాచుకు దూరమైతే యశస్వి జైస్వాల్‌తో రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ అదే నిజమైతే వీరిద్దరిలో ఎవరు ఓపెనింగ్‌కి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి?
Similar News
News December 8, 2024
RECORD: పెంట్ హౌస్‌కు రూ.190కోట్లు
హరియాణాలోని గురుగ్రామ్‌లో DLF కామెలియాస్‌లో ఓ పెంట్ హౌస్ అపార్ట్‌మెంట్ (16,290 sq ft) ₹190కోట్లకు అమ్ముడైంది. ఒక్క sq ft ₹1.8లక్షలు పలికి దేశంలోనే అత్యధిక ధర పలికిన ఫ్లాట్‌గా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. దీనిని ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్ వేర్ సంస్థ డైరెక్టర్ రిషి పార్తీ కొన్నారు. కార్పెట్ ఏరియాల్లో ఈ ధరే అత్యధికమని, ముంబైలో sq ftకి ₹1,62,700 ఉండొచ్చని రియల్ ఎస్టేట్ అనలిస్టులు చెబుతున్నారు.
News December 8, 2024
చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా VSR వ్యాఖ్యలు: వర్ల రామయ్య
AP: ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను డీజీపీ, HRC సీరియస్‌గా తీసుకోవాలన్నారు. VSR, అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని విజయసాయి విమర్శించిన విషయం తెలిసిందే.
News December 8, 2024
మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదు చేయలేదు: పీఆర్ టీమ్
మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర <<14823100>>ఫిర్యాదులు<<>> చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.