News April 17, 2024

సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబు

image

TG: సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.

Similar News

News November 18, 2024

‘వార్-2’ స్పెషల్ సాంగ్‌లో ఆ హీరోయిన్?

image

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్-2’లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 AUG 14న రిలీజ్ కానుంది.

News November 18, 2024

సమగ్ర కులగణన సర్వే 58.3% పూర్తి

image

TG: సమగ్ర కులగణన సర్వేను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఇప్పటివరకూ 58.3% ఇళ్లలో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.16కోట్ల ఇళ్లను గుర్తించగా, ఇప్పటివరకూ 67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 87.1%, నల్గొండలో 81.4%, జనసాంద్రత ఎక్కువగా ఉన్న HYDలో కేవలం 38.3% పూర్తయింది.

News November 18, 2024

టీ అమ్ముకునే వాడంటూ మోదీని అవమానించారు: పవన్

image

టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేశారని పుణే కంటోన్మెంట్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో’ అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు PM అయ్యారని గుర్తుచేశారు. మోదీ మళ్లీ PM అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాను పట్టుబట్టి APలో BJP, TDPతో కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైకింగ్ రేట్‌తో విజయం సాధించామని తెలిపారు.