News November 18, 2024

టీ అమ్ముకునే వాడంటూ మోదీని అవమానించారు: పవన్

image

టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేశారని పుణే కంటోన్మెంట్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో’ అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు PM అయ్యారని గుర్తుచేశారు. మోదీ మళ్లీ PM అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాను పట్టుబట్టి APలో BJP, TDPతో కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైకింగ్ రేట్‌తో విజయం సాధించామని తెలిపారు.

Similar News

News March 10, 2026

HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

image

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్‌కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.

News March 10, 2026

రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

image

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

image

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.