News March 25, 2024

నేడు భద్రాచలం రామయ్య కల్యాణం టికెట్లు విడుదల

image

TG: ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున జరిగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఉభయ దాతల టికెట్ ధర ₹7,500గా ఉంది. దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. ₹2500, ₹2000, ₹1000, ₹300, ₹150 టికెట్లపై ఒక్కరు వెళ్లవచ్చు. ఈ టికెట్లతో పాటు 18న జరిగే పట్టాభిషేకం, ఇతర పూజా టికెట్లను టెంపుల్ <>వెబ్‌సైట్‌<<>>లో పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News September 10, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈనెల 1న ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.

News September 10, 2024

వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం: హోంమంత్రి

image

AP: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయని హోంమంత్రి అనిత తెలిపారు. ‘బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి. కావాలనే వాటిని కొట్టుకువచ్చేలా చేశారు. అవి తలశిల రఘురాం, నందిగం సురేశ్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతాం’ అని అన్నారు.

News September 10, 2024

దులీప్ ట్రోఫీ జట్లలో మార్పులు

image

దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టుల కోసం జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో రెండో రౌండ్ కోసం ఇండియా-C మినహా మిగతా 3 జట్లలో బీసీసీఐ మార్పులు చేసింది. ఇండియా-A కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్‌ను నియమించింది. జైస్వాల్, పంత్ స్థానంలో ఇండియా-Bకి రింకూ సింగ్, ప్రభుదేశాయ్‌ను, అక్షర్ పటేల్ స్థానంలో ఇండియా-Dకి నిషాంత్ సింధును సెలక్ట్ చేసింది. జట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.