News March 5, 2025
భానుడి ప్రతాపం.. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

TG: తెలంగాణపై సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 2 రోజులు ఇదే రీతిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా.
Similar News
News November 19, 2025
భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్లో జరగాల్సిన సిరీస్ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రత్యామ్నాయ సిరీస్కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
News November 19, 2025
ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.