News March 5, 2025

భానుడి ప్రతాపం.. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

image

TG: తెలంగాణపై సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 2 రోజులు ఇదే రీతిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా.

Similar News

News February 10, 2026

కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

image

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.

News February 10, 2026

నెలకు రూ.90వేల జీతం.. నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో 12 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech(కెమికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal2.nrl.co.in

News February 10, 2026

ఉపవాసం: ఏ ఆహారం తీసుకోవాలి?

image

కఠిన ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, దుంపలు తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో మినుములు, బూడిద గుమ్మడి పదార్థాలకు దూరంగా ఉండాలి. వంటల కార్యక్రమాలు చూడటం, ఆహారం గురించి చర్చించడం మనస్సును మళ్లిస్తుంది. అందుకే వాటిని నివారించాలి. బియ్యం లేదా బార్లీతో చేసిన ఆహారంతో ఉపవాసం విరమించడం శ్రేయస్కరం. విరమణ తర్వాత కూడా ఇడ్లీ, దోశ వంటి మినుములతో కూడిన పదార్థాలను తినకూడదని పండితులు సూచిస్తున్నారు.