News November 1, 2024
ఝార్ఖండ్‌లో బిజీగా భట్టి విక్రమార్క
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పండగవేళ సైతం ఎన్నికల హడావుడిలో బిజీగా గడిపారు. ఝార్ఖండ్‌లో త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో ఆయన దీపావళి వేళ అక్కడి నేతలతో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ నవంబర్ 20న ఎన్నికలున్నాయి.
Similar News
News December 6, 2024
ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త చీఫ్ ఎవరంటే..
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) కొత్త అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెట్(SLC) బోర్డు ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా నియమితులయ్యారు. 3 పర్యాయాలు ఏసీసీ చీఫ్‌గా పని చేసిన జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సిల్వాకు ఛాన్స్ దక్కింది. గతంలో ఏసీసీ ఫైనాన్స్-మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు.
News December 6, 2024
8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్
8వ వేతన సంఘం ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 7వ వేతన సంఘం కాలపరిమితి త్వరలో ముగుస్తున్నందున కొత్త ఏడాదిలో కొత్త పే కమిషన్‌పై కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే కొత్త కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం తమ వద్ద లేదని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరీ ఇటీవల రాజ్యసభలో తెలిపారు.
News December 6, 2024
BGT: తొలిరోజు ఆసీస్‌దే
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 180 రన్స్‌కు ఆలౌట్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఆట ముగిసే సమయానికి 86/1 రన్స్ చేసింది. క్రీజులో మెక్‌స్వీని 38, లబుషేన్ 20 ఉన్నారు. ఆసీస్ వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.