News April 25, 2024

ఓటీటీలోకి వచ్చిన ‘భీమా’

image

గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ సినిమా డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఏ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీని కేకే రాధామోహన్ నిర్మించారు. మాళవిక శర్మ, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

Similar News

News January 26, 2026

హిందీ అనేక మాతృభాషలను మింగేసింది: ఉదయనిధి

image

తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదని Dy.CM ఉదయనిధి స్పష్టం చేశారు. 1960sలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాదిలో హిందీని ప్రవేశపెట్టడం వల్ల హర్యాన్వీ, భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు కనుమరుగయ్యాయి. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ నాశనం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.

News January 26, 2026

రంజీ ట్రోఫీ.. 568 రన్స్ తేడాతో బిహార్ ఘన విజయం

image

రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్‌లో మణిపుర్‌పై బిహార్ 568 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఇదే బిగ్గెస్ట్ విన్. బిహార్ ఆటగాళ్లు పీయూష్ సింగ్ 216*, బిపిన్ 143, సకిబుల్ గని 108 పరుగులతో చెలరేగారు. కాగా ఈ విజయంతో వచ్చే సీజన్‌లో ఎలైట్ గ్రూపునకు బిహార్ అర్హత సాధించింది. రంజీ ట్రోఫీలో జట్లను వాటి ప్రదర్శనల ఆధారంగా ఎలైట్(అగ్రశ్రేణి), ప్లేట్(దిగువ శ్రేణి) గ్రూపులుగా విభజిస్తారు.

News January 26, 2026

అండాశయ క్యాన్సర్‌కు కారణాలివే..

image

ఒవేరియన్ కేన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు నిపుణులు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా దీని ప్రమాదం పెరుగుతుంది.