News July 11, 2024

భోలే బాబాకు అమ్మాయిలతోనే స్నానం!

image

UP: హాథ్రస్ తొక్కిసలాటలో 121మంది మరణించడంతో భోలే బాబా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన విషయంలో విస్తుపోయే విషయాలు బయటికి వస్తున్నాయి. భోలే బాబా చుట్టూ వర్జిన్ గర్ల్స్(కన్యలు) ఉండేవారట. వాళ్లు ఎరుపు దుస్తులు ధరించి ఆయనకు స్నానం చేయించి, భోజనం కూడా తినిపించేవారట. పెళ్లయిన మహిళలకు తనను కలిసేందుకు అనుమతి ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే భోలే బాబాను ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోవడం గమనార్హం.

Similar News

News October 6, 2024

అది ఐపీఎల్ టోర్నీలోనే అతిపెద్ద మూవ్ అవుతుంది: ఏబీడీ

image

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ఆర్సీబీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అతి పెద్ద మూవ్ కానుందని అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ ముంబైని వీడే అవకాశం 0.1శాతమేనని పేర్కొన్నారు. అది కూడా జరిగే అవకాశం లేదన్నారు. మరోవైపు గత సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.

News October 6, 2024

18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!

image

అధిక రాబ‌డులు ఆశ‌చూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెర‌ల్ ఆగ్రో కార్పొరేష‌న్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్ల‌పాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల‌ మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వ‌సూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

News October 6, 2024

ఈ పండును తిన్నారా?

image

విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.