News February 4, 2025
BHPL: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: DMHO
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్.మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవో, డాక్టర్లు, సూపర్‌వైజర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు.
Similar News
News February 5, 2025
ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు
✒ 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒ 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒ 1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒ 1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒ 1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒ 2008: వన్డేల్లో సచిన్ 16,000 పరుగులు పూర్తి చేశారు
News February 5, 2025
నల్గొండ: అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు
పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఫిబ్రవరి 10 తేది సాయంత్రం 7గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్‌ల నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే.జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్ళే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు.
News February 5, 2025
NZB: కొక్కెర వ్యాధి వల్లే కోళ్ల మృత్యువాత
కొక్కెర వ్యాధి వైరస్ వ్యాధి వలన జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నిజామాబాద్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. వ్యాధి గ్రహిత కోళ్ల నమూనాలను నిర్ధారణ కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ వ్యాధి వలన మనుషులకు ఎలాంటి ప్రాణాపాయం కలగదని పేర్కొన్నారు.