News February 5, 2025

ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

image

✒ 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒ 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒ 1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒ 1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒ 1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒ 2008: వన్డేల్లో సచిన్ 16,000 పరుగులు పూర్తి చేశారు

Similar News

News February 7, 2025

‘వందే భారత్‌’లో ఫుడ్ ఆప్షన్‌పై కీలక నిర్ణయం

image

‘వందే భారత్‌’ రైళ్లలో ‘పుడ్ ఆప్షన్’ డెలివరీపై రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుక్ చేసే సమయంలో పుడ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు ఆహారం కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే, ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్న సమయంలోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫుడ్ విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రైల్వే బోర్డ్ IRCTCలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.

News February 7, 2025

ట్రైన్‌లో ప్రసవం.. పండంటి ఆడబిడ్డ జననం!

image

బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్‌లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News February 7, 2025

అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

image

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.

error: Content is protected !!