News April 14, 2025
నేటి నుంచి ‘భూభారతి’

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.
Similar News
News April 15, 2025
సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటల్‌కు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్‌ను సురక్షితంగా బయటకు తీశారు.
News April 15, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

ప్రతీకార టారిఫ్స్‌పై యూఎస్ విరామం ప్రకటించడంతో పుంజుకున్న భారత సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్‌లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 1577 పాయింట్ల లాభంతో 76,734, నిఫ్టీ 500 పాయింట్లు పొంది 23,328 వద్ద ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు 3 శాతం ఎగిశాయి. ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, L&T, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్.
News April 15, 2025
పోస్టల్ సర్వీస్‌నూ వదల్లేదు.. ఎంతకు తెగించార్రా?

గుజరాత్లో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. చివరికి పోస్టల్ సర్వీస్‌నూ వదల్లేదు. యూనియన్ టెరిటరీ దాద్రానగర్ హవేలీలోని దీవ్ నుంచి పోస్ట్ మాస్టర్ సాయంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పోస్టల్ స్టాంప్ ఉన్న పార్శిల్స్ చెక్ చేయరని ఈ దారి ఎంచుకున్నారు. కానీ బార్డర్లో పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.