News April 14, 2025

నేటి నుంచి ‘భూభారతి’

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.

Similar News

News April 17, 2026

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యల ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. దీనికోసం ఆహారంలో బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.

News April 17, 2026

పడిపోయిన బొప్పాయి ధరలు

image

AP: యుద్ధం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు పడిపోయాయి. 2 వారాల కిందట టన్నుకు రూ.13 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. ఇప్పటికే అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా 10-15 టన్నుల పంటే చేతికి వచ్చింది. అటు దిగుబడి, ఇటు రేటు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే కాయలు పండిపోతున్నాయి.

News April 17, 2026

వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.