News February 20, 2025
త్వరలోనే ‘భూభారతి’ అమలు: మంత్రి పొంగులేటి

TG: రాష్ట్రంలో వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండా దీనిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భూమిని నమ్ముకుని బతికే వారిని ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం భూములకు సంబంధించి సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్తో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపించారు.
Similar News
News October 19, 2025
దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.
News October 19, 2025
కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.
News October 19, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.