News February 20, 2025

త్వరలోనే ‘భూభారతి’ అమలు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలో వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండా దీనిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భూమిని నమ్ముకుని బతికే వారిని ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం భూములకు సంబంధించి సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపించారు.

Similar News

News March 17, 2025

చైతూ జ్ఞాపకాలను చెరిపేస్తున్న సమంత!

image

నాగచైతన్యతో విడిపోయిన సమంత ఒక్కొక్కటిగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ రింగ్‌లోని డైమండ్‌ను లాకెట్‌గా మార్చుకున్న సామ్ చైతూతో కలిసి వేయించుకున్న టాటూను తొలగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆమె పోస్టు చేసిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన జీవితంలోని చేదు అనుభవాల నుంచి బయటకొచ్చేందుకు ఆమె ఇలా చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

News March 17, 2025

ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

image

TG: 55వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టి చరిత్ర సృష్టించామని CM రేవంత్ అన్నారు. ‘దేశంలో ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉచిత RTC ప్రయాణానికి రూ.5వేల కోట్లు ఖర్చు చేశాం. గృహజ్యోతితో 50లక్షల ఇళ్లలో వెలుగులు చూస్తున్నాం. 43లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్ధి జరుగుతోంది. కోటీ 30లక్షల చీరలను ఇవ్వాలని నిర్ణయించాం’ అని ‘రాజీవ్ యువవికాసం’ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు.

News March 17, 2025

SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం

image

AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్‌గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.

error: Content is protected !!