News August 27, 2024
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రేపు భూమి పూజ
హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనికి రేపు ఉదయం 11గంటలకు భూమి పూజ చేయనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News September 17, 2024
గతంలోలాగా మందులపై సీఎం బొమ్మ లేదు: TDP
AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మందుల కిట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘గత ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు మందుల మీద ఎక్కడా జగన్ రెడ్డి బొమ్మ లేదు’ అని పేర్కొంది.
News September 17, 2024
చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి
CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
నేనేమీ ఫామ్‌హౌస్ సీఎంను కాదు: రేవంత్
TG: ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.