News March 18, 2024

భూపాలపల్లి: ఆస్కార్‌ గుర్తుగా.. గ్రంథాలయం

image

ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తన సొంతూరు చల్లగరిగేలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టారు. పురస్కారానికి గుర్తుగా తన సతీమణి సుచిత్ర ఆలోచన మేరకు గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆంగ్ల అక్షరం ‘O’ ఆకారంలో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.

Similar News

News April 11, 2026

పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

image

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?

News April 10, 2026

24 గంటల్లో అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం AK తండాలో యువతి మహేశ్వరి హత్య ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారం అనంతరం హత్య చేశారనే ఆరోపణలతో ప్రాంతంలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. చట్టం ముందు ఎవ్వరూ మినహాయింపు కాదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.