News November 26, 2024
ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ కార్యక్రమానికి బైడెన్ హాజరవనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఇది రాజ్యాంగ విలువల పట్ల అధ్యక్షుడికి ఉన్న నిబద్ధత అని పేర్కొంది. 2021లో అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికపై విమర్శలు చేసిన ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లని విషయం తెలిసిందే. మరోవైపు అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తానని ఇప్పటికే బైడెన్ ప్రకటించారు.
Similar News
News December 4, 2024
పదవీ విరమణ వయసు మార్పుపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మార్పుపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. పౌర సేవల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు తగిన పాలసీ విధానాలను రూపొందించడంలో కేంద్రం నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది.
News December 4, 2024
వారికి రుణమాఫీ చేసే బాధ్యత నాదే: మంత్రి పొన్నం
TG: రూ.2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేసే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరికైనా ఇప్పటికీ మాఫీ కాకపోతే తన ఆఫీసుకు రావాలన్నారు. రూ.2 లక్షలపైనే రుణాలు ఉన్న వారికి త్వరలోనే మాఫీ చేస్తామని చెప్పారు. ఆపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని తెలిపారు. మిగిలిన హామీలను వరుస క్రమంలో నెరవేరుస్తామని పేర్కొన్నారు.
News December 4, 2024
కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు: ఫడణవీస్
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతలు గవర్నర్‌ను కోరారు. అనంతరం సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు సాయంత్రం 5.30 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉంటారు. కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు’ అని తెలిపారు. కాగా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.