News December 13, 2024

39మందికి క్షమాభిక్ష ప్రకటించిన బైడెన్

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో 39 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. అలాగే, 1500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒకరోజులో ఇంతమందికి క్షమాభిక్ష ప్రకటించడం ఇది తొలిసారి అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బైడెన్ పదవీకాలం జనవరి 20తో ముగియనుంది.

Similar News

News January 23, 2025

కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశ్రుతి.. అభ్యర్థి మృతి

image

AP: విశాఖపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల రన్నింగ్ సమయంలో అభ్యర్థి శ్రావణ్ కుమార్ కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసు అవుతాడనుకున్న కొడుకు పుట్టినరోజునే మృతి చెందటంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

News January 23, 2025

ఆ సెంటిమెంట్ వల్లే ఏపీకి నిధులు: కేంద్ర మంత్రి

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవించి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ ప్యాకేజీ కింద రూ.11,440 కోట్లు కేటాయించామన్నారు. ‘ప్లాంట్‌ను కాపాడేందుకే ఈ ప్యాకేజీ ఇచ్చారు. భవిష్యత్‌లో మరో ప్యాకేజీ ఇస్తాం. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకొస్తాం. ఇక పరిశ్రమను కాపాడడానికి ఇంత మొత్తంలో ఇవ్వడం ఇదే తొలిసారి’ అని పేర్కొన్నారు.

News January 23, 2025

ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్

image

TG: సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయమై ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితాలు కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది వెరిఫికేషన్ మాత్రమేనని తెలిపారు. కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ 40వేల రేషన్ కార్డులు ఇచ్చిందని దుయ్యబట్టారు.