News July 19, 2024
బైడెన్ విజయావకాశాలు తగ్గాయి: ఒబామా
US అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారట. ఎన్నికల్లో పోటీపై బైడెన్ మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని ఒబామా తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత నాన్సీ పెలోసీ కూడా బైడెన్ పోటీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Similar News
News December 10, 2024
‘మంచు’లా కరిగిన మోహన్ బాబు ఇంటి పరువు
50 ఏళ్ల సినీ ప్రస్థానం, 500కు పైగా సినిమాలు, అద్భుతమైన MBU యూనివర్సిటీ, MP, పద్మశ్రీ, ఎన్నో అవార్డులు, డైలాగ్ కింగ్ ఇవన్నీ మోహన్ బాబు పేరు చెప్తే ఇప్పటివరకు గుర్తొచ్చేవి. కానీ కుమారుడు మంచు మనోజ్‌తో గొడవ అంశంతో మంచు ఫ్యామిలీ పరువు మంచులా కరిగిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా 4 గోడల మధ్య పూర్తికావాల్సిన ఆస్తి వ్యవహారం వివాదాలతో బిగ్‌బాస్ హౌస్లా బయటకొచ్చింది. ఈ ఘటన మంచు ఫ్యామిలీకి మచ్చగా మిగిలింది.
News December 10, 2024
రైలు ఆలస్యం.. గమ్యాన్ని చేరేందుకు మూడేళ్లు పట్టింది!
ఇండియాలో రైళ్లు ఆలస్యంగా నడవటం కామన్. ఒక్కోసారి 4 గంటల్లో గమ్యాన్ని చేరే రైలు.. అనుకోని కారణాలతో 8 గంటలూ పట్టొచ్చు. కానీ, విశాఖ నుంచి UPలోని బస్తీకి DAP బస్తాలతో బయల్దేరిన ఓ గూడ్స్ గమ్యాన్ని చేరేందుకు ఏకంగా మూడేళ్ల ఎనిమిది నెలలు పట్టింది. దీంతో దేశంలో అత్యంత ఆలస్యంగా గమ్యాన్ని చేరిన రైలుగా రికార్డులకెక్కింది. కాగా 2014 నవంబర్‌లో బయల్దేరిన ఈ రైలు ప్రమాదం కారణంగా 2018 జులై 25న గమ్యాన్ని చేరుకుంది.
News December 10, 2024
మనోజ్.. నిన్ను కనడమే నేను చేసిన పాపమా?: మోహన్ బాబు
TG: మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్‌కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.