News May 3, 2024

మిత్రదేశాలపై బైడెన్ విమర్శలు.. శ్వేతసౌధం వివరణ

image

భారత్, జపాన్‌లకు వలసదారులంటే భయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్ష కార్యాలయమైన శ్వేత సౌధం స్పందించింది. ‘బైడెన్ వాటిని ఎంత గౌరవిస్తారన్నది మా మిత్రదేశాలకు తెలుసు. వలసదారులు దేశానికి ఎంత కీలకమో చెప్పడమే ఆయన ఉద్దేశం. ఆ అర్థంలోనే ఆ మాటల్ని చూడాలి. జపాన్, భారత్‌ రెండూ మాకు కీలకం. వాటితో బలమైన సంబంధాలున్నాయి’ అని వివరించింది.

Similar News

News March 27, 2026

కురుల ఆరోగ్యాన్ని పెంచే తమలపాకు

image

తమలపాకులు కురుల ఆరోగ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులను దృఢంగా చేసి చుండ్రును నియంత్రిస్తాయి. ☛ మందార పూలు, తమలపాకులు, కరివేపాకు, తులసి ఆకులను పేస్ట్ చేసి 2స్పూన్ల నూనె కలిపి తలకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ☛ తమలపాకు పేస్టుకు కాస్త కొబ్బరినూనె, ఆముదం కలిపి తలకు పెట్టుకొని అరగంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

News March 27, 2026

నేడే శ్రీరామనవమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే

image

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇవాళ ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 1.31 వరకు కోదండరాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

News March 27, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.