News December 2, 2024
కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష.. మండిపడ్డ ట్రంప్

రెండు కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ <<14766211>>క్షమాభిక్ష<<>> పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా జో నిర్ణయంపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ మండిపడ్డారు. చట్టాన్ని ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాగా 2 కేసుల్లో దోషిగా తేలిన తన కుమారుడి కోసం క్షమాభిక్ష కోరబోనని అప్పట్లో బైడెన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయనే హంటర్‌కు క్షమాభిక్ష పెట్టడం గమనార్హం.
Similar News
News February 19, 2025
TGలో త్వరలో ఉప ఎన్నికలు: బండి సంజయ్

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. అందుకే రహస్య సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
News February 19, 2025
CT తొలి మ్యాచ్.. పాకిస్థాన్ ఓటమి

CT-2025 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన NZ 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 47.2ఓవర్లకు 260 పరుగులు చేసి ఆలౌటైంది. బాబార్ ఆజమ్, కుష్‌దిల్ అర్ధశతకాలు చేశారు. విలియమ్, శాంట్నర్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. 23న భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ పాక్ ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
News February 19, 2025
జాక్‌పాట్ కొట్టిన రేఖా గుప్తా

ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) MLA రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ముఖ్యమంత్రి పదవి వరించడం విశేషం. రేఖ అనూహ్యంగా సీఎం అభ్యర్థి రేసులోకి వచ్చారు. పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ వంటి హేమాహేమీలను కాదని హైకమాండ్ ఆమె వైపే మొగ్గు చూపింది. అలాగే దేశంలోని NDA పాలిత రాష్ట్రాల్లో ఈమె ఒక్కరే మహిళా సీఎం కావడం విశేషం.