News February 27, 2025
BIG ALERT: ఉ.11 తర్వాత బయటికి వెళ్లొద్దు

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.
Similar News
News November 26, 2025
NGKL: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

NGKLలో ప్రభుత్వ (డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో నేడు పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి హాజరయ్యారు.అనంతరం పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం అని అన్నారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<


