News December 18, 2024
కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT
APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్‌టికెట్లు ఇవాళ మ.3 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఆఫీసు(ఉ.10-సా.6) సమయంలో నంబర్లను సంప్రదించండి.
Similar News
News January 16, 2025
ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్
ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.
News January 16, 2025
తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.