News October 5, 2024
శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
Similar News
News July 5, 2025
అనుష్క ‘ఘాటీ’ విడుదల వాయిదా

అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 11న విడుదల చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించగా, పోస్ట్పోన్ చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ప్రేక్షకులకు మరింత ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్ని పంచేందుకు సినిమాను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామంది.
News July 5, 2025
PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
News July 5, 2025
రోజుకు 10 గంటలు పని చేసేందుకు అనుమతి

TG: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం GO జారీ చేసింది. వారంలో పనివేళలు 48 గంటలకు మించరాదని <