News October 5, 2024

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

image

శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

Similar News

News November 6, 2024

IPL వేలంలోకి అండర్సన్

image

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ IPL మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 42 ఏళ్ల ఆటగాడు చివరిసారి 2011, 2012లో వేలంలో పాల్గొనగా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ తర్వాత అండర్సన్ IPL వైపు తొంగిచూడలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత IPLలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.

News November 6, 2024

EXIT POLL: ఓటర్లను ప్రభావితం చేస్తున్న 5 అంశాలివే..

image

అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న 5 ప్రధాన అంశాలను ‘ఎడిసన్ రీసెర్చ్’ తొలి ఎర్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది. 35% మందిని ‘ప్రజాస్వామ్యం’, 31% మంది ‘ఎకానమీ’, 14% మంది ‘అబార్షన్’ అంశం, 11% మంది ‘వలస విధానం’, 4% మందిని ‘విదేశీ పాలసీ’ ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యం, అబార్షన్ అంశాలు కమలకు, ఎకానమీ, వలస విధానం ట్రంప్‌నకు కలిసొస్తున్నట్లు సర్వేలో తేలింది.

News November 6, 2024

ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నటి భర్త

image

నటి స్వర భాస్కర్ భర్త ఫాహద్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి ఆయన NCP-SP తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే NCP-SPలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తన భర్త క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినట్లు స్వర ట్వీట్ చేశారు. అతడికి మద్దతుగా నిలిచి విరాళాలు అందించాలని అభ్యర్థించారు. గతేడాది అహ్మద్‌ను స్వర పెళ్లి చేసుకున్నారు.