News September 30, 2024
DSC అభ్యర్థులకు BIG ALERT
TG: DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను DEOలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.
Similar News
News October 4, 2024
అత్యంత ధనిక యాక్టర్ ఈయనే!
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మేల్ యాక్టర్స్ జాబితాలో నటుడు, చిత్రనిర్మాత టైలర్ పెర్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద నికర విలువ దాదాపు $1.4 బిలియన్ (₹11,750 కోట్లు). రెండో స్థానంలో హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ ($1 బిలియన్) ఉన్నారు. వీరి తర్వాత డ్వేన్ జాన్సన్ ($890 మిలియన్లు), షారుఖ్ ఖాన్ ($870 మిలియన్లు), టామ్ క్రూయిజ్ ($800 మిలియన్లు) ఉన్నారు.
News October 4, 2024
ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
News October 4, 2024
Stock Market: మళ్లీ నేలచూపులు
స్టాక్ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. ప్రారంభ సెషన్‌లో Higher Highsతో దూసుకుపోయిన సూచీలు మధ్నాహ్నం 12.30 గంటలకు రివర్సల్ తీసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టంతో 81,688 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల భారీ నష్టంతో 25,049 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో 25,485కు చేరుకున్న నిఫ్టీ ఒక్కసారిగా కుప్పకూలింది. 83,372కు చేరుకున్న తరువాత BSE సూచీలో కూడా అదే ప్యాటర్న్ కనిపించింది.