News March 20, 2024
గ్రూప్-1 అభ్యర్థులకు BIG ALERT

AP: గ్రూప్-1 ప్రైమరీ కీపై APPSC అభ్యంతరాల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. నిన్నటి నుంచి అధికారులు అబ్జెక్షన్స్ స్వీకరిస్తుండగా.. రేపు సాయంత్రంలోగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు. పోస్ట్, వాట్సాప్, SMS, ఫోన్ ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని తెలిపారు. ప్రైమరీ <
Similar News
News March 25, 2026
హార్ముజ్: పాక్ నౌకకు ఝలక్ ఇచ్చిన ఇరాన్

పశ్చిమాసియా యుద్ధం వేళ పాక్‌కు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. హార్ముజ్ నుంచి కరాచీ వెళ్తున్న పాక్ నౌకను వెనక్కి రప్పించినట్లు IRGC తెలిపింది. హార్ముజ్ నుంచి వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదని, అందుకే అడ్డుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కాబూల్‌లోని ఇరాన్ కార్యాలయం ధ్రువీకరించింది. జలసంధి నుంచి వెళ్లే ప్రతినౌక ఇరాన్ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకుంటామని IRGC హెచ్చరించింది.
News March 25, 2026
స్టాక్ మార్కెట్లకు శాంతి చర్చల జోష్!

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద, సెన్సెక్స్ 1,205 పాయింట్లు ఎగసి 75,273 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, L&T, టైటాన్, ట్రెంట్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి.
News March 25, 2026
ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.


