News March 20, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు BIG ALERT

image

AP: గ్రూప్-1 ప్రైమరీ కీపై APPSC అభ్యంతరాల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. నిన్నటి నుంచి అధికారులు అబ్జెక్షన్స్ స్వీకరిస్తుండగా.. రేపు సాయంత్రంలోగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు. పోస్ట్, వాట్సాప్, SMS, ఫోన్ ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని తెలిపారు. ప్రైమరీ <>కీలో <<>>మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకున్నారా?

Similar News

News September 10, 2024

పెరిగిన డిమాండ్.. బంగారం, వెండి ధరలకు రెక్కలు

image

గోల్డ్, సిల్వర్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. జువెల్లర్స్ కొనుగోళ్లు చేపట్టడమే ఇందుకు కారణం. 99.9% స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.74,100గా ఉంది. కిలో వెండి ధర రూ.700 ఎగిసి రూ.84,500 వద్దకు చేరింది. క్రితం సెషన్లో రూ.73,350 వద్ద ముగిసిన 99.5% ప్యూర్ గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,750గా ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోతను బట్టి మున్ముందు ధరల్లో మార్పు రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

News September 10, 2024

లలితా జువెల్లర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం

image

TG: ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నటి, నిర్మాత యార్లగడ్డ సుప్రియ రూ.50లక్షల చెక్కును CM రేవంత్‌కు అందజేశారు. ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం ఆమెను అభినందించారు. మరోవైపు లలితా జువెల్లర్స్ ఓనర్ కిరణ్ రూ.కోటి, హైదరాబాద్ రేస్ క్లబ్ రూ.2కోట్లు, మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రూ.కోటిని CM సహాయ నిధికి అందజేశాయి.

News September 10, 2024

పారాలింపిక్స్ ‘గోల్డ్’ విజేతలకు రూ.75 లక్షలు: మాండవీయ

image

పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సత్కరించారు. గోల్డ్ మెడలిస్టులకు ₹75 లక్షలు, సిల్వర్ విజేతలకు ₹50 లక్షలు, బ్రాంజ్ పతకాలు సాధించిన వారికి ₹30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌లో రాణించిన ప్లేయర్లకు ₹22.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. 2028 పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.