News March 16, 2024
గ్రూప్-1 అభ్యర్థులకు BIG ALERT
TS: గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినట్లు TSPSC ప్రకటించింది. మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్థులు మార్చి 23వ తేదీ ఉ.10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మార్చుకోవచ్చని ప్రకటించింది. దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది.
Similar News
News October 11, 2024
యువకుడి కడుపులో ప్రాణాలతో బొద్దింక.. వైద్యులు ఏం చేశారంటే?
ఢిల్లీ డాక్టర్లు ఓ యువకుడి కడుపులో బతికి ఉన్న బొద్దింకను ఎండోస్కోపి ద్వారా తొలగించారు. గత కొంత కాలంగా యువకుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు చిన్న పేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.
News October 11, 2024
East Asia సదస్సులో మోదీ రికార్డ్
East Asia సదస్సులో హోస్ట్, కాబోయే ఛైర్‌పర్సన్ తర్వాత మాట్లాడే మొదటి అతిథి ప్రధాని నరేంద్రమోదీ అని తెలిసింది. ఇప్పటి వరకు ఈ సదస్సు 19 సార్లు జరగ్గా 9 సార్లు పాల్గొన్న ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి గురించి ఆయన మాట్లాడతారు. క్వాడ్ పాత్రను వివరిస్తారు. లావోస్ బయల్దేరే ముందు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇక ASEANలోనూ భారత్ పాత్ర, ప్రాముఖ్యం పెరిగింది.
News October 11, 2024
ఇ-కామర్స్ కంపెనీల dark patternsపై కేంద్రం స్క్రూటినీ
ఫెస్టివ్ సీజన్లో ఇ-కామర్స్ కంపెనీలు డార్క్ ప్యాటర్న్ రూల్స్ పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైంది. యూజర్ల ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు త్వరగా కొనేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఇంకా 2 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి, మరికాసేపట్లో ఈ వస్తువుపై డిస్కౌంట్ ఉండదని ఫ్లాష్ చేస్తుంటాయి. ఇవన్నీ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి.