News August 14, 2025

పెన్షన్లు తీసుకునే వారికి BIG ALERT

image

AP: అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియ చేపడతారు. 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేస్తారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.

Similar News

News April 15, 2026

శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

image

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక.

News April 15, 2026

AP, TGలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయ్?

image

లోక్‌సభ స్థానాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొత్తం సీట్లు 850కి (54.54%) పెరిగితే.. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా ఏపీలో 14, తెలంగాణలో 9 సీట్లు కలవనున్నాయి. అంటే ఏపీలో మొత్తం ఎంపీ సీట్లు 39కి, తెలంగాణలో 26కి చేరతాయి. ఒకవేళ పెంపు 50%కే పరిమితమైతే APలో 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాదిలో 50% అయితే 65 సీట్లు, 54.54% అయితే 71 స్థానాలు పెరుగుతాయి.

News April 15, 2026

గూగుల్ డేటా సెంటర్‌కు ‘డీమ్డ్ డిస్కం’ హోదా.. అసలేంటిది?

image

APలో 300 మెగావాట్ల కెపాసిటీకి మించి ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు ‘డీమ్డ్ డిస్కం’ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విశాఖ గూగుల్‌ డేటా సెంటర్‌కు ఈ అవకాశం కల్పించింది. త్వరలోనే ఉత్తర్వులివ్వనుంది. రాష్ట్రంలో ఈ హోదా పొందనున్న తొలి ప్రైవేట్ సంస్థ ఇదే. ఇకపై ఆ కంపెనీ ఎలక్ట్రిసిటీ కొరత లేకుండా ఎక్కడినుంచైనా నేరుగా విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. సొంతంగా ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటుచేసుకోవచ్చు.