News December 1, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు BIG ALERT

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నేటి నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒకసారే ఎంటర్ చేస్తే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామంటూ అందరికీ SMSలు పంపారు. గతంలో ఉద్యోగులు సచివాలయానికి వచ్చినప్పుడు లేదా వెళ్లే సమయంలో ఒకసారి హాజరువేసుకున్నా సరిపోయేది.

Similar News

News February 14, 2025

ఏపీలో జీబీఎస్ కేసులు.. ప్రభుత్వం అలర్ట్

image

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్‌కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.

News February 14, 2025

తులసిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు తులసిబాబు తన గుండెలపై కూర్చొని దాడి చేశాడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 14, 2025

ప్రేమికుల దినోత్సవం నాడు దారుణం

image

AP: ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేశ్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

error: Content is protected !!