News December 7, 2024
BIG ALERT.. మళ్లీ భారీ వర్షాలు
AP: హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12 నాటికి తమిళనాడు-శ్రీలంక తీరం వైపు పయనిస్తుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.
Similar News
News January 13, 2025
TODAY HEADLINES
☛ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
☛ ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి TGకి ఉంది: సీఎం రేవంత్
☛ TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
☛ తిరుచానూరులో ఇంటింటికీ గ్యాస్ సరఫరాను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
☛ తిరుమల ఘటనపై CM, Dy.CM రాజకీయ డ్రామాలు ఆపేయాలి: జగన్
☛ దేశంలో ఇప్పటివరకు 17 hMPV కేసులు
☛ మార్చి 21 నుంచి ఐపీఎల్-2025
News January 13, 2025
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు.. రేపే లాస్ట్ డేట్
సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాత పరీక్షకు NTA దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేపు (జనవరి 13) సా.5గంటల వరకూ <
News January 13, 2025
ఉద్యోగుల సమస్యలపై ప్రతినెలా 2 సమావేశాలు
TG: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీస్ సమస్యలపై సత్వర పరిష్కారం కోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెలా రెండో, నాలుగో శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న తొలి భేటీకి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. ఇకపై ఉద్యోగులెవరూ హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదన్నారు.