News August 25, 2024

BIG ALERT.. ఇవాళ భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది.

Similar News

News September 13, 2024

అండమాన్ దీవులకు ఆ పేరెలా వచ్చిందంటే..!

image

అండమాన్‌ దీవులకు మలయ్ జాతి ప్రజలు ఆ పేరును పెట్టినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇండోనేషియాకు చెందిన మలయ్‌ జాతి ప్రజలు అండమాన్ గిరిజనుల్ని బంధించి బానిసలుగా విక్రయించేవారు. రామాయణంలోని హనుమాన్ పేరు మీదుగా దీవుల్ని మలయ్‌ ప్రజలు హండుమాన్‌గా పిలిచేవారు. కాలక్రమంలో అదే అండమాన్ అయిందని ఓ కథనం.

News September 13, 2024

BREAKING: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత

image

ఉల్లి ఎగుమతులపై పూర్తిగా ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఆనియన్ ఎక్స్‌పోర్ట్స్‌పై నిషేధం ఎత్తివేయగా, ఇవాళ మినిమం ఎక్స్‌పోర్ట్ ప్రైజ్(MEP)ను కూడా తొలగించింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టన్ను ఉల్లి ధర కనీసం 550డాలర్లు(₹46,000)గా ఉంటేనే ఎగుమతికి అనుమతి ఉండేది. దీనిపై 40% సుంకం చెల్లించాల్సి వచ్చేది.

News September 13, 2024

కొందరు పోలీసుల తీరు మారడం లేదు: జనసేన

image

AP: ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారడం లేదని జనసేన ట్వీట్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు జనవాణి కార్యక్రమంలో వస్తున్నాయంది. గత ప్రభుత్వంలో YCP నేతల దౌర్జన్యాలకు సహకరించిన పోలీసుల వల్ల నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారంది. ఇప్పటికీ కొందరు పోలీసులు అదే తీరును కొనసాగిస్తున్నట్లు వారు వాపోయారని తెలిపింది.