News November 12, 2024

BIG ALERT.. రేపు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News December 7, 2024

నో ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా: డీకే శివ‌కుమార్‌

image

CM సిద్దరామ‌య్య‌, త‌న మ‌ధ్య ఎలాంటి ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా లేద‌ని DK శివ‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో పార్టీ నేత‌లెవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌న్నారు. తానెప్పుడూ ఏ ఫార్ములా గురించి మాట్లాడ‌లేదని, రాజ‌కీయ అవ‌గాహ‌న‌తో ఇద్దరం క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే CMతో ఒప్పందం కుదిరింద‌ని ఇటీవ‌ల‌ DK వ్యాఖ్యానించగా, అలాంటి ఒప్పందం ఏమీ లేద‌ని CM కొట్టిపారేశారు. దీంతో రచ్చ మొదలైంది.

News December 7, 2024

ఆ కారు పేరు మార్చేసిన మహీంద్రా

image

మ‌హీంద్రా త‌న కొత్త ఎల‌క్ట్రిక్‌ కారు మోడ‌ల్ పేరును మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఇటీవ‌ల SUV మోడ‌ల్స్‌లో BE 6e విడుద‌ల చేసింది. అయితే మోడ‌ల్ పేరులో 6e వాడ‌కంపై విమాన‌యాన సంస్థ‌ IndiGo అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఏళ్లుగా త‌మ బ్రాండ్ ఐడెంటిటీలో 6eని వాడుతున్నామ‌ని, దీనిపై త‌మ‌కు ట్రేడ్‌మార్క్ హ‌క్కులు ఉన్నాయంటూ వాదించింది. దీంతో మ‌హీంద్రా త‌న BE 6e మోడ‌ల్‌ను BE 6గా మార్చింది.

News December 7, 2024

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్

image

TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.