News October 8, 2024
రేపు బిగ్ అనౌన్స్మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్

AP: రేపు బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.
Similar News
News November 20, 2025
నేడు వరంగల్ మార్కెట్ బంద్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం బంద్ ఉండనుంది. అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కు ఉత్పత్తులు తీసుకొని రావొద్దని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
News November 20, 2025
సిద్దిపేట: కూలి రూపం.. హిడ్మా మరో కోణం!

మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి దళంలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి హిడ్మా. అయితే హిడ్మా జీవితంలో, మరొక కోణం దాగి ఉంది. పదేళ్ల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు టన్నుల్లో కూలి రూపంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో కూలిగా వ్యవహరిస్తూనే ఆయన పార్టీ రహస్య కార్యకలాపాలు చేశాడన్న విషయం తర్వాత పోలీసులకు అర్థమైంది. హిడ్మా మరణంతో ఈ విషయాలు బయటపడుతున్నాయి.