News October 8, 2024

రేపు బిగ్ అనౌన్స్‌మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్

image

AP: రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.

Similar News

News December 16, 2025

MAIDSలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>మౌలానా <<>>అజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(MAIDS) 17 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.67,700-రూ.2,08,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://maids.delhi.gov.in/

News December 16, 2025

సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్‌ లింక్!

image

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకుల<<>> మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ‘సాజిద్ అక్రమ్(50)ది ఓల్డ్ సిటీ. ఇద్దరు సోదరులు, బంధువులు అక్కడే ఉన్నారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల కోసం గతంలో ఇండియాకు వచ్చాడు. అతడి కొడుకు నవీద్‌కు పుట్టుకతో ఆసీస్ పౌరసత్వం ఉంది’ అని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండియాతో ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పాయి.

News December 16, 2025

IPL.. పతిరణకు రూ.18 కోట్లు

image

శ్రీలంక యంగ్ బౌలర్ మతీశా పతిరణను రూ.18 కోట్లకు KKR కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పతిరణ స్పెషల్. ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు. సౌతాఫ్రికా బౌలర్ నోర్జ్‌ను లక్నో రూ.2 కోట్లకు దక్కించుకుంది. అటు భారత స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.