News October 29, 2024
బిగ్ బీ, చిరుకు థాంక్స్ చెప్పిన నాగార్జున
ANR నేషనల్ అవార్డ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు, అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ‘లివింగ్ లెజెండ్స్ బచ్చన్, చిరు ANR శత జయంతి వేడుకలకు హాజరై మరపురాని జ్ఞాపకాలను అందించారు. మీ రాకతో ఈ వేడుక మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది. నాన్నగారి జీవితానికి సంబంధించి కీరవాణి చేసిన ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 3, 2024
అమెరికాలో భారత ఓటర్లు ఎంత మందో తెలుసా?
అమెరికాలో మెక్సికన్ల తర్వాత ఎక్కువ మంది వలసదారులు ఇండియాకు చెందినవారే ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్రస్తుతం 52 లక్షల మంది ఇండో-అమెరికన్స్ ఉండగా, ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. చాలా ఏళ్లుగా వీరు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఓట్లు గంపగుత్తగా డెమొక్రటిక్ పార్టీకి పడే అవకాశం లేదని, యువతలో చాలా మంది ట్రంప్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
News November 3, 2024
ఢిల్లీలో మరింత పడిపోయిన వాయు నాణ్యత
దేశరాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ WHO సూచించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఉ.5గంటలకు AQI 507 పాయింట్లతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
News November 3, 2024
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం
ఇండిగో, ఎయిరిండియా విమానాలకు మరో సారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నై-హైదరాబాద్ ఎయిరిండియా, హైదరాబాద్-పుణే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు గోవా-కోల్‌కతా విమానానికి ఇదే తరహా బెదిరింపులు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.