News January 25, 2025
RCBకి పెద్ద దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

WPL-2025కి RCB ఆల్ రౌండర్ సోఫీ డివైన్ దూరమయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ప్రొఫెషనల్ అడ్వైజ్ మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు NZ పేర్కొంది. WPLలో RCB తరఫున 18 మ్యాచులాడిన సోఫీ 402 రన్స్, 9 వికెట్లు తీశారు. టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు(99*) ఆమె పేరిటే ఉంది. ఓపెనర్‌గా మెరుపులు మెరిపించే ఈ ప్లేయర్ లేకపోవడం RCB పెద్ద లోటే.
Similar News
News February 15, 2025
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి: రకుల్

కంఫర్ట్ జోన్ ప్రజలను ఎదగనీయదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మీకు అలవాటైన ప్రదేశం నుంచి బయటకు రండి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు. మీరు ఎదగాలంటే అక్కడి నుంచి బయటపడాలి. కఠినమైన విషయాలు నేర్చుకోవాలి. కొత్తదనాన్ని కోరుకోవాలి. సుఖవంతమైన జీవితం అందరినీ బద్ధకస్థులుగా మారుస్తుంది.’ అంటూ రాసుకొచ్చారు.
News February 15, 2025
14 ఏళ్లకే లక్ష మొక్కలు నాటింది

తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి సింగ్ లక్ష మొక్కలు నాటారు. ‘ప్రసిద్ధి ఫారెస్ట్ ఫౌండేషన్’ స్థాపించి ‘చెట్ల అమ్మాయి’గా ప్రసిద్ధి పొందారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. 110 ప్రాంతాల్లో 1.3 లక్షలకుపైగా వాటిని నాటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అడవుల కోసం ఆమె చేస్తున్న కృషికిగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం PM రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రకటించింది.
News February 15, 2025
గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారు: సీఎం

సంత్ సేవాలాల్ APలో పుట్టినా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని CM చంద్రబాబు కొనియాడారు. సచివాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహాత్మాగాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారని చెప్పారు. బ్రిటీష్ కాలంలో మతమార్పిడులపై పోరాడారని, ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన అప్పుడే బోధించారని పేర్కొన్నారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.