News April 9, 2024

BIG BREAKING: లేఖ విడుదల చేసిన కవిత

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. ‘లిక్కర్ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నేను తప్పు చేశాననడానికి ఆధారాలు కూడా లేవు. రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి రుజువు లభించలేదు. వేరే వ్యక్తుల స్టేట్‌మెంట్‌తో నన్ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు. కేవలం బాధితురాలిని మాత్రమే’ అని కవిత పేర్కొన్నారు.

Similar News

News January 10, 2025

రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని వివరించారు.

News January 10, 2025

సినిమాల స్పెషల్ షోలకు అనుమతిపై పునః సమీక్షించండి: హైకోర్టు

image

TG: సినిమాల ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతినివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘గేమ్ ఛేంజర్’ టికెట్ల ధరలు, స్పెషల్ షోలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోలకు అనుమతులివ్వడం ఏంటని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునః సమీక్షించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

News January 10, 2025

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘గేమ్ ఛేంజర్’ HD ప్రింట్!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను పైరసీ వెంటాడింది. రూ.450+ కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే HD ప్రింట్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమా చూడండి.