News January 10, 2025

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘గేమ్ ఛేంజర్’ HD ప్రింట్!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను పైరసీ వెంటాడింది. రూ.450+ కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే HD ప్రింట్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమా చూడండి.

Similar News

News January 26, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 26, 2025

శుభ ముహూర్తం (26-01-2025)

image

✒ తిథి: బహుళ ద్వాదశి రా.7.17 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట ఉదయం 7.08 గంటల వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1) సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: సా.3.30-5.09 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.34-3.13 వరకు

News January 26, 2025

వందేళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ

image

గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భ రేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్‌లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.