News December 22, 2024

రాష్ట్రంలో మళ్లీ భూకంపం

image

ఏపీలోని ప్రకాశం జిల్లాలో నిన్న భూప్రకంపనలు రాగా ఇవాళ మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ఒక సెకనుపాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భయాందోళనకు గురైన వారంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. శనివారం కూడా దాదాపు ఇదే సమయంలో భూమి కంపించడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 1, 2026

రేషన్‌లో గోధుమ పిండి.. నేటి నుంచే పంపిణీ

image

AP: ప్రభుత్వం రేషన్‌లో గోధుమ పిండిని పంపిణీ చేయనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో ఇవాళ్టి నుంచి కిలో రూ.20కే అందజేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే మండల స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని తెలిపారు. దీపం పథకం కింద నాలుగో విడత రాయితీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని, మార్చి నెలాఖరు లోపు బుక్ చేసుకోవాలని సూచించారు.

News February 1, 2026

‘కాపు నేత’పై దాడి అని వైసీపీ ట్వీట్

image

AP: YCP నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై TDP కార్యకర్తలు దాడి చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ‘కాపు నేత’పై టీడీపీ దాడి చేసిందని వైసీపీ అఫీషియల్ X పేజీలో #TDPAntiKapu అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. ‘నాడు వంగవీటి రంగాను హత్య చేశారు. మొన్న ముద్రగడ కుటుంబంపై, నేడు అంబటిపై దాడి చేశారు. తర్వాత మాపై దాడి చేస్తారా?’ అని మాజీ మంత్రి తోట త్రిమూర్తులు మండిపడ్డారు.

News February 1, 2026

కొత్త స్కామ్: రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..

image

సైబర్ కేటుగాళ్లు మరో కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. మీ దగ్గర రూ.5 నోటు చాలా అరుదని, ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని ఫోన్ కాల్స్ చేసి నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ కోసం ముందుగా కొంత డబ్బు పంపాలని సూచిస్తున్నారు. ఇది నమ్మి వారికి డబ్బులు వేయగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటితో పాటుAPK ఫైళ్లు పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజులు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.