News August 27, 2024

BIG BREAKING: కవితకు బెయిల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. మార్చి 15 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు గంటన్నర పాటు కవిత లాయర్ ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఎస్వీ రాజు మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. కవిత బెయిల్‌కు అర్హురాలన్న రోహత్గీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించి బెయిల్ ఇచ్చింది.

Similar News

News September 10, 2024

నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం: శ్రీధర్ బాబు

image

TG: పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను BRS ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.

News September 10, 2024

ఆటో డ్రైవర్ నిజాయితీ.. డైమండ్ నెక్లెస్ తిరిగిచ్చాడు!

image

విలువైన వస్తువులు కోల్పోతే అవి దొరకడం కష్టమే. అయితే, హరియాణాలోని గురుగ్రామ్‌లో రూ.లక్షల విలువ చేసే డైమండ్‌ నెక్లెస్‌ ఉన్న బ్యాగ్‌ను ఓ మహిళ ఆటోలో మరిచిపోయింది. అందులో విలువైన వస్తువులు కూడా ఉండటంతో మహిళ ఆందోళన చెందింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కొద్దిసేపటికే బ్యాగ్ మరిచిపోయారంటూ డ్రైవర్ ఇంటికి రావడంతో ఆ మహిళ ఖుషీ అయింది. డ్రైవర్ నిజాయితీని అభినందిస్తూ చేసిన లింక్డ్‌ఇన్‌ పోస్ట్ వైరలవుతోంది.

News September 10, 2024

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి.. లైన్ క్లియర్?

image

AP: ఇటీవలే YCPకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు TDPలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా తన సోదరులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసిన ఆయన వరద సాయంగా రూ.50 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా శిద్దా పార్టీలో చేరికపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా 2014లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.