News June 23, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS MLA

image

TG: జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Similar News

News November 8, 2024

రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న

image

AP: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు.

News November 8, 2024

IPL: ఈ ఆరుగురిపై పంజాబ్ కన్ను?

image

పంజాబ్ కింగ్స్ పర్సులో అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. దీంతో వేలంలో ఆ జట్టు ఏ ఆటగాడిని కొనడానికైనా వెనకాడదని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రిషభ్ పంత్ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమైనట్లు టాక్. అలాగే శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, కగిసో రబాడ, లియామ్ లివింగ్‌స్టోన్ కోసం భారీగా ఖర్చు చేస్తుందని సమాచారం. ఈ ఆరుగురు ఆటగాళ్లను కచ్చితంగా దక్కించుకుంటుందని తెలుస్తోంది.

News November 8, 2024

ఈ కేక్ ముక్క ఖరీదు అక్షరాలా రూ.2.40 లక్షలు

image

క్వీన్ ఎలిజబెత్-2 వివాహం నాటి కేక్ ముక్కను వేలం వేయగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో స్కాట్లాండ్‌కు చెందిన మారియన్ పోల్సన్ దానిని రూ.2.40 లక్షలకు కొన్నాడు. కాగా ఎలిజబెత్-ఫిలిప్ పెళ్లి 1947లో జరిగింది. అప్పటి నుంచి ఆ కేక్ పీస్‌ను భద్రంగా ఫ్రిడ్జ్‌లో దాచారు. ఇప్పుడు దానిని వేలంలో ఉంచారు.