News June 21, 2024

BIG BREAKING: రైతు రుణమాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

image

TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. కాగా పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.

Similar News

News September 8, 2024

రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డూ

image

AP: దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరులో గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. మాగుంట లే అవుట్‌లో ఏర్పాటు చేసిన మండపంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, పోటాపోటీలో చివరకు రూ.8.01 లక్షలు పలికింది. తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసులు రెడ్డి లడ్డూని వేలంలో దక్కించుకున్నారు.

News September 8, 2024

ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు.. ఘాట్ రోడ్లపై రాకపోకలు నిషేధం

image

AP: అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో నర్సీపట్నం-సీలేరు, వడ్డాది-పాడేరు, అరకు-అనంతగిరి, రంపచోడవరం-మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిషేధించారు.

News September 8, 2024

మరో ఘటన.. గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వాగులోకి..

image

ఇటీవల విజయవాడలో గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని తల్లీకొడుకు బుడమేరు వాగులో చిక్కుకున్న ఘటన తరహాలోనే మరొకటి జరిగింది. శ్రీశైలం దర్శనం ముగించుకున్న 9 మంది గూగుల్ మ్యాప్‌ పెట్టుకొని కారులో రిటర్న్ అయ్యారు. అయితే అది వారిని నేరుగా TGలోని నాగర్ కర్నూల్ జిల్లా సిర్సవాడ దుందుభి వాగులోకి తీసుకెళ్లింది. అక్కడ చిక్కుకున్న వారిని గ్రామస్థుల సహాయంతో పోలీసులు ట్రాక్టర్‌‌తో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.